Header Banner

అమరావతిలో మరో భారీ అడుగు! సచివాలయ టవర్లకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ!

  Wed Apr 16, 2025 19:33        Politics

రాజధాని అమరావతి నిర్మాణంపై వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. వచ్చే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు.. మరోవైపు.. ఎంపిక చేసిన పనులకు టెండర్లు పిలుస్తోంది సీఆర్డీఏ.. రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు సీఆర్డీఏ అధికారులు.. సచివాలయానికి 4 టవర్లు, హెచ్వీడీ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు.. హెచ్వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్ పిలిచిన అధికారులు.. సచివాలయానికి సంబంధించిన 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లతో మరో టెండర్కు పిలిచారు..

ఇక, సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేశారు సీఆర్డీఏ అధికారులు.. మొత్తంగా 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టనుంది సీఆర్డీఏ.. మరోవైపు.. మే 1వ తేదీన సచివాలయ, హెచ్వీడీ టవర్లకు టెక్నికల్ బిడ్లు తెరవనుంది సీఆర్డీఏ.. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు.. అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టి.. కొన్ని పనులు చేపట్టినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పూర్తిగా పక్కకు పెట్టింది.. అంతేకాకుండా.. మూడు రాజధానుల స్టాండ్తో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని భావించారు.. ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి అభివృద్ధిలో వేగంగా అడుగులు ముందుకు పడుతోన్న విషయం విదితమే..

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Amaravati #SecretariatTowers #CRDA #ChandrababuNaidu #APDevelopment